Corona Cases in China: 2020 సంవత్సరం నుండి మొన్న మొన్నటి వరకు కరోనాతో వణికి పోయిన భారత్‌ ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంది. అయితే ఇతర దేశాల్లో ఇంకా కరోనా భయం జనాలను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. కరోనా పుట్టిన దేశం చైనాలో ఇంకా కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనాలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉన్నాయట. కొత్త కొత్త వేరియంట్స్ తో చైనా కరోనా కారణంగా కంటిన్యూగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ వేరియంట్ కారణంగా చైనాలో కొత్త కేసుల సంఖ్య లక్షలు దాటి కోట్లుగా నమోదు అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. 


ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే చైనా లో అత్యధికంగా ప్రభావం చూపిస్తోంది. జూన్ నెలలో చైనాలోకి కరోనా కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. జూన్‌ చివరి వారం వరకు 6.5 కోట్ల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Also Read: CIBIL Score Without Loans: క్రెడిట్ హిస్టరీనే లేనప్పుడు సిబిల్ స్కోర్ పెంచుకోవడం ఎలా


రాబోయే రెండు వారాల పాటు చైనాలో కరోనా కేసులు ఉప్పెన మాదిరిగా ఎగసి పడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా అధికారిక మీడియా సంస్థలో కూడా కరోనా కేసులు ఆందోళన కరంగా ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది. 


గత సంవత్సరం జీరో కోవిడ్ విధానంను ఎత్తి వేసిన చైనాకు అప్పటి నుండి ఈ సమస్య మొదలు అయ్యింది. కరోనా కేసులు భారీ ఎత్తున నమోదు అవ్వడమే కాకుండా 85 శాతం మంది ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లుగా వెళ్లడి అయ్యింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ను తగ్గించేందుకు స్థానిక ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అస్సలు ప్రతిఫలం ఇవ్వడం లేదు. 


కొత్త కొత్త వేరియంట్స్ కారణంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. మరణాల సంఖ్య కూడా ముందు ముందు భారీగా పెరిగినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా ఆందోళన వ్యక్తం అవుతోంది. చైనా నుండి మళ్లీ కొత్త వేరియంట్స్ ఇతర దేశాలకు ఎక్కడ విస్తరిస్తాయో అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.


Also Read: WTC Final 2023 Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023.. విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK